ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ విలయ తాండవం చేస్తూ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న  విషయం తెలుసిందే. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు అతి తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి... రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో లక్షకు చేరువలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కరోనా  కేసుల సంఖ్య, జగన్ సర్కార్ కరోనా  వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టినప్పటికీ.., కరోనా  ప్రకంపనలు మాత్రం ఎక్కడ ఆగడం లేదు.రోజు రోజుకి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మాత్రం భయం గుప్పిట్లో బతుకుతుంది.


అయితే కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి.. జగన్ సర్కార్ కరోనా వైరస్ పరీక్షల విషయంలో... క్వారంటైన్ నిర్వహణ విషయంలో.. కరోనా  రోగుల చికిత్స విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. భారీగా నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ లోని  కరోనా  రోగుల చికిత్స, ఆహారం విషయంలో లోటుపాట్లు ఉండకూడదు అని జగన్ సర్కారు నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే జగన్ సర్కార్  ఆదేశాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సర్కార్ లక్ష్యం నెరవేరడం లేదేమో అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.


పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ కరోనా  సెంటర్లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోవిడ్  కేర్ సెంటర్ లో...కరోనా  రోగుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కరోనా  రోగులకు ఎంతో పౌష్టికాహారాన్ని అందించాల్సిన అధికారులు..నిర్లక్షంగా నిన్న రాత్రి వాసనకొట్టే  ఆహారాన్ని అందించినట్లు తెలుస్తోంది. దీంతో  కరోనా  చికిత్స తీసుకుంటున్న బాధితులు ఆహారాన్ని తినకుండానే పడేసి పస్తులతోనే ఉన్నట్లు సమాచారం. కోవిడ్ సెంటర్లో నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదు అంటూ ఆరోపిస్తున్నారు రోగులు. ఇప్పటికే కరోనా  తో బాధపడుతున్న తమకు  సరైన ఆహారం అందించకపోతే ప్రాణాలు పోవడం ఖాయం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: