ప్రస్తుతం చైనా భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ సరికొత్త టెక్నాలజీతో కూడిన.. యుద్ధ విమానాలను ఆర్డర్ చేసి శరవేగంగా రప్పించుకుంటుంది . ఇంకొన్ని రోజుల్లో రఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇక దీని గురించి అటు చైనా కు కూడా భయం పట్టుకుంది తెలుస్తోంది. ఎందుకంటే చైనా దగ్గర లేనటువంటి అధునాతన టెక్నాలజీతో ప్రస్తుతం యుద్ధ విమానాలను తయారు చేయించింది భారత్. సాధారణ రఫెల్ యుద్ధ విమానాల కంటే.. ప్రస్తుతం భారత్ అదనంగా మరింత టెక్నాలజీని ఉపయోగించి యుద్ధ విమానాలను తయారు చేయించింది. అయితే ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఎన్నో అద్భుతమైన యుద్ధవిమానాలు ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం రఫెల్ యుద్ధ విమానం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఇక ఇప్పటికే బయల్దేరిన రఫెల్ యుద్ధ విమానం ఇంకొన్ని రోజుల్లో భారత్ వైమానిక దళంలో చేరనుంది. దీంతో చైన.. రఫెల్ యుద్ధ విమానం గురించి తెలుసుకునేందుకు ఎన్నో చర్యలు చేపడుతుంది. చైనా ఎన్నో వ్యూహాలను అమలు చేస్తూ భారత్ రప్పిస్తున్న రఫెల్ యుద్ధ విమానాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయాలను బయటకు చెప్పేందుకు నిరాకరించింది. దీంతో చైనా కు భారీ షాక్ తగిలింది.
అయితే ఈ రఫెల్ యుద్ధ విమానం గేమ్ చేంజర్ అయినటువంటి ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. రెగ్యులర్ గా ప్రాన్స్ వాడుతున్న రఫెల్ యుద్ధ విమానాలకు ప్రస్తుతం భారత్ లో కి రాబోతున్న రఫెల్ యుద్ధ విమానాలకు ఎంతో తేడా ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రత్యేకంగా భారత అవసరాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ విమానాన్ని భారత్ రీడిజైన్ చేయించుకుంది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట, యుద్ధ విమానం భారత వైమానిక దళం లోకి వచ్చిన తర్వాత.. శరవేగంగా దాడి చేసే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం అర్థమవుతుంది. రఫెల్ యుద్ధ విమానం భారత వైమానిక దళం లోకి వస్తుడటంతో చైనా కి భయం పట్టుకుంది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి