మామూలుగా దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల తో నిండిపోయి ఉంటాయి అనే విషయం తెలిసిందే. కంపెనీలలో ఎప్పుడు చూసినా హడావిడి కనిపిస్తూ ఉంటుంది. కానీ కరోనా  వైరస్ పుణ్యమా అని కంపెనీలన్నీ కాలి అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్  హోమ్ చేయిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండే పని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా  కూడా ఇదే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ... గూగుల్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకునే నిర్ణయాలను పాటిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. 

 

 అయితే గతంలో కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి లాక్ డౌన్  విధించిన సమయంలో.. జూలై వరకు వర్క్ ఫ్రమ్  హోమ్ విధించాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతితో జూలై వరకు ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్   కాస్తా డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. డిసెంబర్ వరకు ఉద్యోగులు అందరూ ఇంటి నుండే పని  చేయాలి అంటూ  సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్ణయించాయి.ఉద్యోగులు  కూడా డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదు అన్నట్లుగానే సిద్ధం అయిపోయారు. కానీ ప్రస్తుతం గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందని అనే టాక్ వినిపిస్తోంది. 

 

 డిసెంబర్ 31 వరకు మాత్రమే కాకుండా వచ్చే ఏడాది జూలై చివరి  వరకు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్  హోమ్ విధించాలి అని గూగుల్ నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగానే గూగుల్ ఇలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే మిగతా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తద్వారా ఎంతో మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే వాళ్ళ మీద డిపెండ్ అయి బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్  హోం విధిస్తే వారిపై ఆధారపడ్డ వారికీ  ఉపాధి కరువవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ గూగుల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వీటిని అడ్డుకునే  అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: