ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని దేశాలను కదిలిస్తుంది ఈ కరోనా  వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి... ఎవరినీ వదిలిపెట్టడం లేదు.ప్రపంచ  వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాక్సిన్  పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం మరింత ఆందోళనకు దారి తీస్తున్న విషయం తెలిసిందే.



ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా అన్ని దేశాలు కరోనా వైరస్ ని ఎదుర్కొనే... వాక్సిన్  తయారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో దాదాపుగా  అన్ని దేశాల్లో  కరోనా  వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. కాగా  అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా కరోనా వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రైల్స్  జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి ప్రపంచానికి కరోనా  వైరస్ వాక్సిన్ ని ముందుగా అందించేది అమెరికా మాత్రమే అంటూ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక  తాజాగా మరోసారి కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు డోనాల్డ్ ట్రంప్. ఇటీవలే వైట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ప్రపంచ దేశాలకు కరోనా  వైరస్ వ్యాక్సిన్ అందించేది అమెరికానే అంటూ వ్యాఖ్యానించారు.


కరోనా  వైరస్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ప్రస్తుతం శరవేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది అంటూ తెలిపిన ట్రంప్.. అమెరికాలో కరోనా  వైరస్ అందుబాటులోకి రాగానే వివిధ దేశాలకు వెంటిలేటర్లు ఇతర సామాగ్రి పంపిణీ చేసిన తరహాలోనే ఈ వ్యాక్సిన్ కూడా సరఫరా చేస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా కరోనా  వైరస్ వాక్సిన్  క్లినికల్ ట్రైల్స్ పూర్తయ్యి..  వచ్చే ఏడాది ప్రారంభం వరకు  ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అంటూ తెలిపారు. అందరికంటే ముందుగా తమ దేశమే కరోనా  వైరస్ వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తుందని.. ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికాలో కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: