టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా.. ట్రబుల్ షూటర్ గా.. అద్వితీయమైన కార్యదక్షత ఉన్న ఒక నాయకుడిగా... ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లోనే జీవిస్తూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే.. ప్రజాసేవకుడు గా మంత్రి హరీష్ రావుకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పని ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహించే ఘనుడు హరీష్ రావు. హరీష్ రావు చేతిలో ఏదైనా పని వచ్చిందంటే అది సమర్థవంతంగా పూర్తవుతుంది అని అందరూ ఎంతో నమ్మకంతో ఉంటారు. అది ఎన్నికలైనా ప్రాజెక్టులైనా ఇంకా ఏదైనా.. ఒకసారి హరీష్ రావు  రంగంలోకి దిగాడు అంటే..షో స్టార్ట్ అవుతుంది. సాహో సినిమాలో ప్రభాస్ ఇట్స్ షో టైమ్ అంటూ చెప్పిన విధంగానే ఒకసారి హరీష్  రంగంలోకి దిగారు అంటే కార్యకర్తలందరూ ఇట్స్  షో టైమ్  అని చెప్తూ ఉంటారు.


 అయితే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. టిఆర్ఎస్ పార్టీ విజయం అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. 2014లో తెలంగాణ సర్కార్ కాళేశ్వరం అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఎంతో మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా.. వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది . ఇక అదే సమయంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు కాలేశ్వరం ప్రాజెక్ట్.. పెద్ద సవాలుగా మారిపోయింది అనే చెప్పాలి. కానీ హరీష్ రావు కార్యదక్షత ముందు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు సైతం చిన్నదిగా మారిపోయింది. అతి తక్కువ సమయంలో అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి.. మరోసారి తన కార్యదక్షతను నిరూపించుకున్నారు హరీష్ రావు.


 ఏ పనినైనా  పూర్తి చేయడంలో తాను ఎంత సమర్థుడో  అని మరోసారి రుజువు  చేసుకున్నారు. నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరిగారు, ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం అవుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు  అధికారుల్లో  సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అలుపెరుగని వీరుడుగా  కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కష్టపడి ఆయన హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అనేంతలా ప్రభావితం చేసి..  తెలంగాణ ప్రజల మనసులు గెలిచాడు హరీష్ .

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: