ప్రస్తుతం చైనా- భారత్  మధ్య సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీస్తుంది, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏ క్షణానైనా యుద్ధం జరగొచ్చు అనే సంకేతాలు ఇస్తోంది. ఎందుకంటే అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన చైనా రెండు ప్రాంతాల్లో వెనక్కి వెళ్లినప్పటికీ.. మరో రెండు ప్రాంతాల్లో  వెనక్కి వెళ్లాలని ఎన్ని సార్లు చర్చలు జరిపిన అక్కడే తిష్టవేసి కూర్చుంటుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యాధికారులు.. చైనా  అధికారులతో చర్చలు జరిపినప్పటికీ అవి కూడా ఉపయోగం లేకుండా పోయాయి.కాగా  ఎలాగైనా సరిహద్దుల్లో మోహరించిన చైనా సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టేందుకు.. ఏం చేయడానికైనా వెనుకాడము  అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చైనాకు సంకేతాలు ఇచ్చింది. కేవలం సంకేతాలు ఇవ్వడమే కాదు దానికి అనుగుణంగా ప్రస్తుతం సరిహద్దుల్లో సైన్యం మోహరింపులు.. ఆయుదాల మొహరింపు లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైనికులు ఉండగా అదనంగా మరో 45 వేల మంది సైనికులను కూడా  సరిహద్దుల్లోకి కేంద్ర ప్రభుత్వం పంపించినట్లు సమాచారం.



అంతే కాకుండా ఎంతో శక్తివంతమైన ఆయుధాలను కూడా సరిహద్దు లోకి తరలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే అధునాతన  టెక్నాలజీతో రూపొందించబడిన ఎంతో శక్తివంతమైన రఫెల్ భారత అమ్ములపొదిలో చేరడం భారత ఆర్మీ ని మరింత శక్తివంతం చేస్తుంది, అయితే రఫెల్  లాంటి శక్తివంతమైన యుద్ధ విమానం వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఊరుకోకుండా.. చైనా ఎలాంటి దాడి చేసిన దానికి సరైన ప్రతి దాడి చేసి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే జల యుద్ధానికి కూడా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి కూతవేటు దూరంలో కి.. ఐఎన్ఎస్ కోల్కత్తా యుద్ధ నౌక అరేబియా సముద్రంలోకి మోహరించింది.


ఇండియన్ సూపర్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక మరోవైపు సముద్ర జలాల్లోకి రంగంలోకి దిగింది. అంతేకాకుండా ప్రస్తుతం భారత నౌకాదళంలో ఉన్న సబ్ మెరైన్ యుద్ధనౌక లను కూడా రంగంలోకి దింపింది కేంద్ర ప్రభుత్వం. ఇలా అన్ని రకాలుగా  చైనాతో యుద్ధానికి సిద్ధమవుతుంది భారత్. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: