కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి.. క్రమంగా ప్రపంచదేశాలను కమ్మేసింది. దీంతో కరోనా ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.90 లక్షలకు చేరుకోగా.. 1.28 లక్షల మంది రికవకీ అయ్యారు. అటు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. మొదట కరోనాను లైట్‌గా తీసుకున్న ప్రజలు.. ఇప్పుడు కరోనా పేరు చెబితేనే వణికిపోతున్నారు.

వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని తేలడంతో.. యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి పరిశోధకులు రాత్రింబవళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ, కరోనా వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. వ్యాక్సిన్ అందుబాటులో రాకపోవడంతో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసూటికల్
ఇండస్ట్రీ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా తీవ్రతను తగ్గించే ఔషధంగా చెబుతున్న ఫావిపిరవిర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ ఒక్కొక్కటి కేవలం రూ.35లకే విక్రయిస్తున్నట్లు కీలక ప్రకటిన చేసింది.

ఫావిపిరవిర్ మందును స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్ల చికిత్సకు ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం ఇదివరకే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ ఫ్లూగార్డ్ పేరిట ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏదేమైనా దేశంలో రోజురోజుకు కేసుల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాల్ని, తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని చెప్పే ఈ ఫావిపిరవిర్ ఔషధం ధర ఎక్కువ కాకుండా.. అందుబాటు ధరలోనే తీసుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.