ఈ మధ్యకాలంలో... ప్రేమలు ఎంతో చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి ... అవసరాల కోసం ప్రేమించుకున్నారా లేదా ప్రేమించుకున్న తర్వాత ఎవరి అవసరాలు వారు  చూసుకుంటున్నారా అన్నది అర్థం కాని పరిస్థితి. ప్రేమ పేరుతో అవసరాలను తీర్చుకోవడం ఆ తర్వాత పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ముఖం చాటేయడం లాంటి ఘటనలు ఈ రోజుల్లో  తెరమీదికి వస్తూనే ఉన్నాయి, అవసరాల కోసం ప్రేమ అనేపేరు వాడుకుంటూ... ప్రేమ అనే పదానికి  ఉన్న గొప్ప అర్థాన్ని కూని చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇటీవలే ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్లితో  ఒక్కటయ్యారు.. చివరికి పెళ్ళయిన కొన్ని రోజులకే వరుడు మొహం చాటేశాడు,



 ఫేస్ బుక్ ప్రేమ ఇక్కడ వరకు దారి తీసింది. వరంగల్ జిల్లాకు చెందిన యువతికి... హైదరాబాద్ కు  చెందిన యువకుడికి ఫేస్ బుక్ లో  పరిచయం ఏర్పడింది. యువతి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఫేస్ బుక్ లో  పరిచయమైన అనూష రాకేష్ ల మధ్య పరిచయం కాస్తా స్నేహానికి దారితీస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని రోజులు కొనసాగిన తరువాత అకస్మాత్తుగా వరంగల్ జిల్లా నందవరం కి చెందిన అనూష... తనను హైదరాబాద్  చెందిన రాకేష్ పెళ్లి చేసుకుని ఆ తర్వాత తల్లిదండ్రులను కలిసి వస్తానని చెప్పి ముఖం చాటేశాడు అంటూ చెప్పుకొచ్చింది. న్యాయం చేయాలంటూ వరుడు ఇంటి ముందు బైఠాయించింది.



 పెళ్లి చేసుకుని తనతో కాపురం చేయకుండానే పరారయ్యాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతన్ని  ఎంతో ప్రాణంగా ప్రేమించానని చివరికి ఇలా రోడ్డుపాలు చేస్తాడు అని అనుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు న్యాయం చేయాలంటూ యువకుడి  ఇంటి ముందు బైఠాయించడంతో మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి, వెంటనే మహిళా సంఘాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాయి, అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి... న్యాయం చేస్తాము  అంటూ హామీ  ఇచ్చారు. అయితే చివరి లో ట్విస్ట్ ఏమిటీ అంటే.. ఆ యువకుడు యువతి కంటే చిన్నవాడు. అతని వయస్సు  19 యేళ్లు అయితే యువతి వయస్సు 26 యేళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: