కానీ నలుగురు యువకుల్లో ఇద్దరు యువకులను మాత్రమే కాపాడగలిగారు. మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పెరంబలూర్ కొట్టరాయ్ సమీపంలోని సిరువచ్చుర్ గ్రామంలో క్రికెట్ ఆడేందుకు వచ్చారు యువకులు. ఈ క్రమంలోనే సమీపంలో ఉన్న జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇక జలాశయం దగ్గర బట్టలు ఉతికి ఇంటికి వెళుతున్న మహిళలను జలాశయంలో స్నానం చేయవచ్చా అని అడిగారు. ప్రస్తుతం జలాశయంలోకి దిగడం ప్రమాదకరం అంటూ మహిళలు అప్పటికే హెచ్చరించారు. కానీ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కాలుజారి జలాశయంలో పడిపోయారు.. వారిని రక్షించేందుకు మరో ఇద్దరు యువకులు వెళ్లి వాళ్లు కూడా ప్రమాదంలో పడిపోయారు.
ఇంటికి వెళుతున్న మహిళలు ఇది గమనించారు. కాసేపు కంగారు పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మరో ఆలోచన చేయకుండా తమ ఒంటి మీద ఉన్న చీరలను విప్పేశారు. నీటిలో మునిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకులకు వారి చీరలను విసిరారు. ఇక మహిళలు విసిరిన చీరలను పట్టుకుని సదరు యువకులు అతికష్టం మీద బయటికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అప్పటికే వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కేవలం ఇద్దరు ప్రాణాలను మాత్రమే కాపాడగలిగారు మహిళలు. అయితే ఎంతో ధైర్యం చేసి ఏకంగా మానాలను కూడా లెక్కచేయకుండా చీరలు విసిరి యువకులను కాపాడడం తో ఎంతో మంది మహిళలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి