ఆరేళ్ల పాపను చాక్లెట్ ఇస్తానని చెప్పి ఎత్తుకెళ్లి రేప్ చేశాడు ఇక్కడ ఒక కామాంధుడు. ఇక ఈ కేసులో పోలీసు విచారణ తప్పుదారి పట్టించేందుకు తెలివైన ప్లాన్ వేసాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లాహోర్ లో చోటుచేసుకుంది. ఆగస్టు 6వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని చాక్లెట్లు ఇస్తానని చెప్పి దగ్గరలో ఉన్న తోట లోకి తీసుకెళ్ళి రేప్ చేశాడు. తర్వాత పాపను అక్కడే వదిలేసి పరారయ్యాడు. పాప కోసం గాలిస్తున్న తన తల్లిదండ్రులకు తర్వాత రోజు పాప ఆచూకీ తెలిసింది. ఇక వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు. చాకచక్యంగా విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు.
నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఒక సూసైడ్ నోట్ లభించింది. మీరు నన్ను పట్టుకుంటారని తెలుసు... తర్వాత ఎన్కౌంటర్ చేస్తారు అందుకనే నేను ప్రశాంతంగా చనిపోతున్నాను నా ఫ్యామిలీని వేదించకండి అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు సదరు వ్యక్తి. డెడ్ బాడీ మాత్రం దొరకలేదు కాబట్టి పోలీసులు మరింత అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. కీలక సమాచారం తో ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఇక వారి దగ్గర్నుంచి పారిపోతుండగా ఏకంగా... షూట్ చేయడంతో కాలికి గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు... అనంతరం అక్కడి నుంచి జైలుకు తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి