మన దేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ పొందింది. మన దేశంలోని కంపెనీలలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సొంతంగా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ తొలి దశ క్లినికయల్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. జైడస్ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్-డి తొలి దశ పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రజలకు మొదట ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మన దేశంలో అనుమతులు పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 1600 మందిపై ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ప్రయోగిస్తోంది. దేశంలోని 17 ప్రాంతాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారిని ఎంపిక చేసి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. వ్యాక్సిన్ తయారీ కోసం ఒప్పందం చేసుకున్న సీరమ్ నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో వ్యాక్సిన్లను తయారు చేస్తున్న కంపెనీలు సైతం 1100 మందిపై వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నాయి.
బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ కొన్ని రోజుల క్రితం ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ కోసం 15 కోట్ల డాలర్లు(రూ. 1125 కోట్లు) అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి