అనుకొండ - మొసలి... ఈ పేర్లు  వింటేనే వెన్నులో వణుకు పుట్టక మానదు. ఎందుకంటే ఇవి అంత ప్రమాదకరమైన జీవులు కాబట్టి. ఎక్కువగా అడవిలో జీవించే ఈ  జీవులు ఎక్కడైనా పొరపాటు గా మనకి కనిపించాయి అంటే వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెడతారు ప్రతి ఒక్కరు. టీవీ లో వీటిని చూసినప్పటికీ... భయం కలగకమానదు, అయితే ఇలాంటి ఎంతో ప్రమాదకరమైన జీవులు ఒకసారి పోట్లాడటం మొదలుపెట్టాయి అంటే అది ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 అందుకే అనకొండ మొసలి లాంటి ఎంతో బలం కలిగిన జీవుల మధ్య పోరు అంటే ఊహించడమే కష్టం అని చెప్పాలి, మామూలుగా  ఈ రెండు జీవుల  కొట్లాట జరిగినా అది అడవి ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. ఈ రెండు జీవులు ఎదురుపడినప్పుడు ఎప్పుడైనా ఇలా ఈ రెండింటి మధ్య పోరు జరుగుతూ ఉంటుంది. కానీ జనావాసాల మధ్య ఇలాంటి పోరు  జరగడం ఎప్పుడైనా చూశారా. అందరూ చూస్తుండగా ఓ వైపు నుంచి అనుకొండ మరో వైపు నుంచి మొసలి హోరాహోరీగా పోట్లాడటం చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది.



 ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.  వెన్నులో వణుకు పుట్టించేలా అనకొండ మొసలి  జనావాల్లోనే  పోట్లాటకు దిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బ్రెజిల్ లో ఈ  ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్ లోని పోన్టా నెగ్ర   అనే ప్రాంతంలో ఉండే స్థానికులు అందరూ అనుకొండ ముసలి పోరాటాన్ని సెల్ఫోన్ లో  చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా చేయడంతో ఇది కాస్త ఎంతో మందిని ఆకర్షిస్తుంది.  వీడియోలో  అనకొండ మొసలిని  బలంగా చుట్టి మింగడానికి ప్రయత్నిస్తోంది. మొసలి అనుకొండ నుంచి తప్పించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇది గమనించిన స్థానికులు అందరూ అతి కష్టం మీద.. ఈ రెండింటిని  విడదీయగా.. తర్వాత రెండు కూడా వాటి దారిలో అవి వెళ్లిపోయాయి,

మరింత సమాచారం తెలుసుకోండి: