ఏ విషయం అయినా, ముక్కుసూటిగా విమర్శలు చేస్తూ,  సొంత పార్టీ నేతలపైన, రాజకీయ ప్రత్యర్థులపైన విమర్శలు చేస్తూ, హల్చల్ చేస్తూ ఉంటారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు. పిసిసి అధ్యక్షుడు రేసులో తాను కూడా ఉన్నాను అంటూ అంటూ గతంలో సంచలన ఆరోపణలు చేసిన వీహెచ్ ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గి, రేవంత్ కు తప్ప ఎవరికి అధ్యక్షపీఠం కట్టబెట్టినా, తాము మద్దతు ఇస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తాసిల్దార్ నాగరాజు వ్యవహారంపై వి హనుమంత రావు స్పందించారు. కీసరలో 1981లో ఇందిరాగాంధీ పేదలకు భూములు పంపిణీ చేశారనే విషయాన్ని వీహెచ్ గుర్తు చేశారు.


కానీ లబ్ధిదారులకు తెలియకుండానే వాళ్లకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని వీహెచ్ చెప్పుకొచ్చారు. 2006లో దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. భూసంస్కరణలు అమలు చేసి పేదలకు పంచాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక చోట్ల పేదల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, ప్రభుత్వ భూములు సైతం ఎంతో మంది ఆక్రమించారని, వీటన్నిటిని పాటించుకుని న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.


ప్రభుత్వం పట్టించుకోకపోయినా, పేదలకు కేటాయించాల్సిన భూములపై కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని వీహెచ్ చెప్పుకొచ్చారు. అసలు లబ్ధిదారులను పక్కనపెట్టి, ఎవరెవరికో సంబంధం లేని వ్యక్తులకు ఎమ్మార్వో నాగరాజు పట్టాలు జారీ చేశారని వీహెచ్ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ విషయంపై దృష్టి పెట్టి, ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సూచించారు. అసలు ఎమ్మార్వో నాగరాజు కలెక్టర్ కు ఉన్న సంబంధం ఏమిటో ముందు బయటపెట్టాలి అని, అసలు ఈ 94 ఎకరాలు ఎవడబ్బ సొమ్ము అంటూ వీహెచ్ ఘాటుగా విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: