ఇక ఇప్పుడు వినియోగదారులకు కొత్త సర్వీస్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎంతో మంది వినియోగదారులు.. బ్యాంకులకు వెళ్లడానికి గానీ ఏటీఎం సెంటర్ లకు వెళ్లడానికి గాని వెనకడుగు వేస్తున్నారు, ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంక్ డోర్ స్టెప్ ఎస్ బి ఐ ఎటిఎం సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది, బ్యాంకు కస్టమర్లు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు...
ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మీ ఇంటి వద్దకే డబ్బులు వచ్చేస్తాయి. కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఖాతాదారుల అందరికీ ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి, ఎస్బిఐ లక్నో సర్కిల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ తాజాగా వేదికగా వెల్లడించారు. ఒక వాట్సప్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఎస్బిఐ వాట్సాప్ లేదా ఎస్ బి ఐ ఫోన్ కాల్ సర్వీస్ లను పొందవచ్చు అంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం లక్నోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపిన ఆయన.., ఇక్కడ ఈ సేవలు విజయవంతమైతే ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు, ఈ సేవ కారణంగా సీనియర్ సిటిజన్స్ కి మరింత బెనిఫిట్ లభించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి