మోహన్ బాబు అంటేనే భారీ డైలాగులకు పెట్టింది పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. అదే కోవకు చెందిన డాక్టర్ మోహన్ బాబు ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు కావడం ఆశ్చర్య పరిచే విషయం. మోహన్ బాబు చాలా కష్టపడి ఇంతటి స్థానానికి చేరుకోగలిగారు. దీని వెనుక ఆయన కృషి, శ్రమ, పట్టుదల మరియు మొక్కవోని దీక్షతో ఇంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగారు. అలాంటి మోహన్ బాబు ముక్కుసూటిగా ఏ విషయం గురించైనా మాట్లాడగలిగే అలవాటు ఉంది. ఆయన  ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడినా "టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ" అవుతోంది అంత పదునుగా ఉంటాయి అయన  మాటలు.





ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతోమందికి ఆవేశం తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలపై ఆయన చేసిన  విమర్శలు ఎంతోమందికి ఘాటుగా తగిలాయి. ఏపీలో జగన్ పాలన చాలా బాగుందని, తాను ఎన్నికల ముందు ఏమి చెప్పారో ఇప్పుడు అదే చేస్తూ తన పాలనను సాగిస్తున్నాడు. ప్రజలకు అందవలసిన అన్ని సంక్షేమ పథకాలను నేరుగా ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు అందరూ కష్టపడుతున్నారు   అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.  మరోపక్క ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపికి ఈ వ్యాఖ్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. అంతేకాదు గతంలో మాదిరి సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించడం అనేది ఇంక అసాధ్యమనే చెప్పాలి అన్నారు. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే జరుగుతుంది. కానీ ఏ విధంగానూ ఈ రాజకీయాలు వర్కవుట్ కావు.





ఇన్నేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో తనకు తీవ్ర అసంతృప్తి రాజకీయాల్లోనే ఉండిపోయింది అన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నన్ను ఒకడు దెబ్బ కొట్టాడని ఇప్పుడు అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పారు. అప్పట్లో మేము ఇద్దరం కలిసి ఒక వ్యాపార సంస్థ కూడా నెలకొల్పాము.  ఈ విషయంలో నన్ను మోసం చేసి తర్వాత అతను ముఖ్యమంత్రి అయ్యాడు. చచ్చిన పామును కొట్టకూడదు అంటారు ఆ సామెతను  కొన్ని సందర్భాల్లో ఉపయోగించక తప్పదు. అతని గురించి ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. నా సన్నిహితులు కొందరు ఆ విషయం గురించి సర్దుకొని వదిలేయనున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నాను నా కాలికి ముల్లు గుచ్చుకుంటే నాకు బాధ కలుగుతుంది. కానీ ఆ నొప్పి ఆ మూర్ఖుడికి తెలియదు కదా అంటూ తన ఆగ్రహాన్ని చూపించారు. అలాగే తిరుపతిలోని విద్యానికేతన్ స్కూలుకు ప్రభుత్వం నుంచి రావలసిన ఫీజు బకాయిలను కూడా రాకుండా చేశారు. దీని గురించి నేను మీడియా వారితో మాట్లాడితే ఎటువంటి స్పందన రాలేదు. ఈ విధంగా తనను మోసం చేసిన ఆ వ్యక్తి గురించి మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా తన కొడుకు విష్ణు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి స్కూల్ బకాయిల గురించి చెప్పగా త్వరలోనే విడుదల చేస్తానని అన్నారు. ఇప్పుడు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: