కానీ గత కొన్ని రోజుల నుంచి వరుసగా రెండవసారి కూడా కరోనా వైరస్ బారిన పడిన కేసులు వెలుగులోకి వస్తుండటం భయాందోళనకు గురిచేస్తుంది. ఇటీవల అమెరికాలో ఇలాంటి మొదటి కేసు నమోదు అయ్యింది. 25 ఏళ్ల యువకుడుకి రెండవసారి కూడా కరోనా సోకినట్లు తాజాగా అక్కడి పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇప్పటికే హాంకాంగ్ లో అధికారికంగా తొలి రీ ఇన్ఫెక్షన్ కేసు నమోదైన విషయం తెలిసిందే. పలు దేశాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు టాక్ వచ్చింది.
గతంలో హాంగ్ కాంగ్ లో నమోదైన ఇన్ఫెక్షన్ కేసులో రెండోసారి అతనికి ఎలాంటి లక్షణాలు లేవు కరోనా ప్రభావం కూడా శరీరంలో తక్కువగానే ఉంది. కానీ ఇటీవల అమెరికాలో నమోదైన కేసులో మాత్రం మొదటి సారి కంటే రెండవ సారి కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఏప్రిల్ తొలిసారిగా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తి ఇటీవలే మరోసారి అనారోగ్యం బారిన పడి వైద్యులను సంప్రదించగా.. కరోనా టెస్ట్ చేయడంతో అతనికి పాజిటివ్ అని తేలింది. అయితే అమెరికా పరిశోధకులు అందరూ దీన్ని ఎంతో సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పరిశోధనలు జరుపగా మొదటిసారి సోకిన వైరస్ కంటే రెండవ సారి సోకిన కరోనా వైరస్ భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇక దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి