ఎందుకంటే కొత్తగా కారు కొనుగోలు చేయాలి అనుకునే వారికి దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్త కారు కొనుగోలు చేయాలి అనుకునే వారు తక్కువ వడ్డీతో సులభంగానే లోన్ పొందేందుకు అవకాశం కల్పించింది. కేవలం 7.5 శాతం నుండి ప్రారంభమవుతుంది. అంతేకాదు తమ కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేంటంటే ప్రాసెసింగ్ ఫీజు.. ఒకవేళ మీరు కారు తీసుకోవాలి అనుకుంటే... ప్రాసెసింగ్ ఫీజు నుంచి తమ కస్టమర్లకు మినహాయింపు ఇచ్చేందుకు నిర్వయించింది.
అంతేకాదు కారు కొన్న తర్వాత ఇంటి దగ్గరే ఛార్జింగ్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేసి కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని కల్పించేందుకు నిర్ణయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ ఇక్కడే ఓ కిటుకు ఉందండోయ్. టాటా మోటార్స్ కు చెందిన టాటా నెక్సన్ ఈవి కారు కొనుగోలు చేస్తేనే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఆఫర్ లు అందుబాటులో ఉంటాయి . ఈ కారు కొనుగోలు చేస్తే స్టేట్ బ్యాంక్ నుంచి మొత్తంగా కస్టమర్లు మూడు ఆఫర్లు పొందే అవకాశం ఉంది. ఎస్బిఐ యోనో యాప్ ద్వారా పూర్తి వివరాలు ఆఫర్ ఏంటో తెలుసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి