జిల్లాలోని వలేటివారి పాలెం కి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక గత కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందుల తో సతమతమవుతున్న తల్లిదండ్రులు.. రోజురోజు కుటుంబ పోషణ భారం కావడం తో... కుమార్తెను... యుగంధర్ నాగమణి దంపతుల వద్ద పనికి కుదిర్చారు. సోఫాలు కుర్చీలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారి దగ్గర పనికి పెట్టగా ... సదరు దంపతులు బాలికను ఢిల్లీ తీసుకెళ్లారు. కానీ అంతలోనే ఆ తల్లిదండ్రులు ఊహించని ఘటన చోటు చేసుకుంది. పనికి వచ్చిన చిన్నారి పై కన్నేసిన యజమాని.. బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.
ఇది తప్పు అని చెప్పి అడ్డుకోవాల్సిన భార్య బాలికపై అత్యాచారం చేసేందుకు భర్తకు సహకరించింది . ఆ తర్వాత కొన్నాళ్లకే బాలికను తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే ఓరోజు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా బాలిక గర్భం దాల్చింది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి