భారత్లోని వివిధ  బ్యాంకుల్లో ... ఆర్థిక సంస్థల దగ్గర... వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని చెల్లించకుండా టోపీ పెట్టి విదేశాలకు మకాం మార్చిన ఆర్థిక నేరగాళ్లపై నెట్  ఫ్లిక్స్  ఓ సిరీస్ రూపొందించింది. ఈ సిరీస్ ద్వారా అటువంటి నేరస్తులకు బ్రేక్ వేయనుంది.‘బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ ‘ పేరిట ఈ సిరీస్ నేటి నుండి  ప్రసారం కావాల్సి ఉండగా...  ఇది ప్రసారం కాకుండా చూడాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఆ  సీరిస్ సత్యం కుంభకోణం తరహాలో తన బయోపిక్ తీశారనే అనుమానం ఉందని ఇవాళ రామలింగరాజు కోర్టును ఆశ్రయించగా... ఆయన ఆరోపణ విన్న కోర్టు ‘బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్' సిరీస్ ని విడుదల చేయవద్దని  ఉత్తర్వులు ఇచ్చింది.




ఈ వెబ్ సిరీస్ బ్యాంకులను, జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన  విజయ్ మాల్యా, సహారా సుబ్రతా రాయ్, నీరవ్ మోదీ, సత్యం రామలింగ రాజులను ఉద్దేశించి, వారి నిజ జీవితాన్ని ఆధారం చేసుకొని తీసిందని  ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది... ఈ ట్రైలర్ లో చూపిన పాత్రలు కూడా వీరిని అనుసరించే రూపొందించినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే విడుదల అయిన వెబ్ సిరీస్ ట్రైలర్లో పాత్రలను కూడా చూపగా అందరికీ అదే మిషన్ స్పష్టమవుతుంది. అయితే గతంలో ఈ వెబ్ సిరీస్ మీద ‘ఫ్యుజిటివ్ డైమండ్ మర్చంట్’ మెహుల్ చోక్సీ కూడా ఆరోపణలు చేశారు. 



ఇది తమని ఉద్దేశించే తీశారని  విడుదలకు ముందు  దీన్ని తాము కచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందని... ఢిల్లీ హైకోర్టులో తన లాయర్ ద్వారా అప్పీలు దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో సత్యం రామలింగరాజు ఈ సీరిస్ పై కోర్టుకు వెళ్ళగా ప్రసారం నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆర్థిక నేరగాళ్లపై దేశవ్యాప్తంగా వ్యతిరేక భావం ఉన్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదల ఆగిపోవడంతో సినీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మళ్లీ ఇది తిరిగి పున ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: