ప్రశాంతంగా ఉన్న సరిహద్దులను ఉద్రిక్తంగా మార్చింది. ఇలాంటి క్రమంలోనే భారత్ తో సరిహద్దు వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. భారత సరిహద్దులో చైనా వ్యవహరిస్తున్న నీచమైన తీరు రోజురోజుకు చర్చనీయాంశంగా మారి పోతుంది. భారత్ శాంతియుతంగా వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ఎన్ని సార్లు శాంతియుతంగా చర్చలు జరిపినప్పటికీ.. ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాటన్నింటిని తుంగలో తొక్కుతూ.. ప్రతిసారీ తమ నీచమైన వ్యవహార శైలిని బయటపెడుతూనే వచ్చింది చైనా.
రాత్రి సమయంలో ఎలాంటి ఘర్షణలు అవసరం లేదని... ఏదైనా ఉంటే పగటి సమయంలో చూసుకుందాం అంటూ గతంలో చైనా భారత్ మధ్య జరిగిన చర్చల్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరుదేశాలు. అయితే ఇలా సరిహద్దులో చైనా ఇప్పటికే పలుమార్లు చర్చల్లో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి భారత్ ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూనే ఉంది. ఇక చైనా వ్యవహారంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత వాడి వేడిగా మారిపోతున్నాయి. ఇక ఇటీవల అర్ధరాత్రి సమయంలో చర్చల్లో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కుతూ... చైనా ఏకంగా కర్రలు కత్తులతో సరిహద్దుల్లో భారత సైనికుల మీదికి దాడికి రావడం... చైనా నీచ బుద్ధికి పరాకాష్టగా మారిపోయింది. చైనా ఒప్పందం ఉల్లంగించటం పై భారత్ రగిలిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి