ప్రపంచ దేశాల ను వణికిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఇప్పటికే వివిధ దేశాల లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్  శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే భారత్ లో  కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇక భారత ప్రజలందరి ఆశలు భారత్ బయోటెక్ వాక్సిన్ పైనే ఉన్నాయి. అయితే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వివిధ దశల లో క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్.. ఇటీవలే రెండో దశ టెక్నికల్ ట్రయల్స్  లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కాగా  క్లినికల్ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కో వ్యాగ్జిన్  వ్యాక్సిన్ జంతువులపై సత్ఫలితాల ను ఇచ్చింది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది భారత్ బయోటెక్.



 ఈ వ్యాక్సిన్ కారణంగా జంతువుల లో ఎలాంటి దుష్ప్రభావం జరగలేదని... అంతేకాకుండా ఫలితాలు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. రెండోసారి డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత.. ముక్కు గొంతు ఊపిరితిత్తుల్లో వైరస్ ను సమర్ధవంతం గా నియంత్రించినట్లు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు. అయితే ఈ వ్యాక్సిన్  కోతులపై ఉపయోగించిన విషయాన్ని కూడా తెలిపింది భారత్ బయోటెక్.



 కాగా  ఇది భారత ప్రజలు అందరికీ ఒక శుభవార్త అనే చెప్పాలి. రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న తరుణంలో ప్రస్తుతం వ్యాక్సిన్ వస్తేగానీ కరోనా  వైరస్ ను నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం భారత్ బయోటెక్ ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పడం ఇదొక శుభపరిణామం అని చెప్పాలి. ఇక భారత్ బయోటెక్ ప్రకటనతో ప్రజలందరిలో కొత్త ఆశలు చిగురించి కుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: