ఎన్ని చర్చలు జరిపినా చైనా తన తీరు మార్చుకోవడం లేదు. తన పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. ఏది ఎంతవరకు సమంజసం అనేది పక్కనుంచితే... వారి ఏం చెప్తే అదే జరిగి తీరాలి అనే మొండి వైఖరితో భారత్ పై తన అధికారాన్ని చూపడానికి ప్రయత్నిస్తోంది... ఇప్పటికే పలు సార్లు చైనా బలగాలను భారత సైన్యం దీటుగా ఎదుర్కొని  సమర్థవంతంగా నిలువరించారు... దీంతో చైనా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయినా పెను యుద్ధానికి సై అంటోంది చైనా... భారత్ తో తలపడటానికి సన్నాహాలు చేస్తోంది చైనా రాజ్యం..... మన భారత్ ప్రతిసారీ ఎప్పటికప్పుడు వారిని చిత్తు చేస్తూ బుద్ధి చెబుతూనే వస్తుంది.... ఇప్పుడు కూడా చైనా తనకై తాను కాలుదువ్వుతుంటే వెనక్కి తగ్గేది లేదని భారత్ సైనిక దళాలను పెంచి పోరాటానికి సిద్ధం చేస్తోంది.ఇప్పటికే  భారత్ ఎంతో సమర్థవంతమైన టెక్నాలజీ ఉన్న యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది, సైన్యంలో జోరు పెంచి స్పూర్తి ని నింపింది...


ఎంతకీ మారని జిత్తులమారి చైనా ఎత్తులను చిత్తు చేసేందుకు అన్ని రకాల యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడుతోంది... అంతేకాదు ఎన్నో దేశాలు మనకు మద్దతు పలుకుతూ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తాజాగా గాల్వన్ లోయలో ఈ విషయాన్ని గ్రహించిన చైనా మొదట్లో ప్రగల్భాలు పలికిన కారణంగా ఇప్పుడు వెనక్కి తగ్గ లేక .. ముందు చూస్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్న సందిగ్ధంలో పడింది.భారత సైనికులు గాల్వన్ లోయకు  కొండ ఎగువభాగం లో సిద్ధంగా ఉన్నారు. అలాగే చైనా సైనికులు కొండకు సరిగ్గా కిందకు పాంగ్వాన్గ్ సరస్సు దగ్గర పొంచి ఉన్నారు. అయితే పాంగ్వాన్గ్ లోయలో 60  నుండి 70  శాతం చైనావారిది కాగా 30  నుండి 40 శాతం మాత్రమే మనకి ఉంది.  ఈ సరస్సు 164 కిలోమీటర్స్ పొడవు ఉండడం మరియు టిబెట్ వైపు నుండి ఉండడం చైనా వారికిప్రతికూలమనే చెప్పాలి.


కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల జరిగిన గాలిలో కాల్పులు కూడా ఆ ప్రదేశంలోనే జరిగాయి. చైనా సైన్యం మాత్రం వ్యూహాలతో సరస్సు నుండి బోటుల ద్వారా వచ్చి భారత సైనికులను కాల్చడానికి ప్రయతిస్తున్నారు. కానీ ఇక్కడ వారికి తెలియని విషయం ఏమిటంటే మనవాళ్ళు పై నుండి వీరిని చాలా సులభంగా కాల్చేయవచ్చు, అదే వీరు మన వాళ్ళను కాల్చాలంటే చాలా కష్టం. అందుకే వారు కాల్పులు జరిగిన తరువాత తోక ముడిచి లోపలికి వెళ్లిపోయారు. ఇప్పుడు చైనా పదే పదే ఆ ప్రదేశం నుండి ఖాళీ చేయమని భారత సైనికులమీద ఒత్తిడి తెస్తోంది. అయితే మనవాళ్ళు దానికి ససేమిరా అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏంజరగనుందో?
 

మరింత సమాచారం తెలుసుకోండి: