కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో నిత్యవసర సరుకులతో పాటుగా అన్నీ పెరిగాయి.. తినకుండా ఉండలేము.. దీంతో పదిరుపాయలు ఎక్కువైన కూడా కొనుక్కొని మరి తింటున్నాం. అయితే ప్రస్తుతం సామాన్యుడికి టమోటా, ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.ఈ రెండు లేకుండా అసలు కూరలు ఉండవు. ముఖ్యంగా టమోటా ధర 70 రూపాయలు కిలో పలుకుతున్నాయి. కిలో 100 పలికిన కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు టమోటా వ్యాపారులు. అలాంటి టమోటాలను కూడా దొంగలు ఎత్తుకెళ్తున్నారు.. ఎంటీ టమోటాలను దొంగతనం చేశారా అని ఆశ్చర్యపోకండి నిజమే.. కేజి రెండు కేజీలు కాదండీ..ఏకంగా లారీ లోడు ను దొంగతనం చేశారు. లారీతో స్పీడ్ గా వెళ్తుండటంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆశ ఉండాలిగాని మరీ అత్యాశ ఉండకూడదు..


వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు లో వెలుగు చూసింది. ఈ ఘటన పుంగనూరు సమీపంలో జరిగింది. జిల్లాలోని రొంపిచెర్లకి చెందిన వేణుగోపాల్ తన లారీలో టమోటా లోడుతో పుంగనూరు మార్కెట్ నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కి బయల్దేరాడు. పలమనేరు రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద ఆర్టీవో అధికారులమంటూ ముగ్గురు దుండగులు లారీని అడ్డగించారు. తర్వాత కత్తులతో డ్రైవర్ ను బెదిరించి టమోటా లతో పాటుగా లారీని కూడా తీసుకెళ్లారు.


వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. లారీతో సహా పరారైన దోపిడీ దొంగలు పారిపోయే క్రమంలో వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారు. వేగంగా లారీని నడపటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. లారీ కోసం వెళుతున్న పోలీసులకు లోడు తో ఉన్న లారీ బోల్తా కొట్టిందని తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పరిశీలించారు. పల్టీలు కొట్టడం తో లారీని అక్కడే వదిలేసి దొంగలు పారిపోయారు. పుంగనూరు సీఐ గంగిరెడ్డి స్పాట్‌ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: