జాధవ్ పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఓ క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మిమి చక్రవర్తి జిమ్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ కారు తో ఆమెను ఫాలో అయ్యి మరీ కారును తన దగ్గరకు తెచ్చి అసభ్యంగా సైగలు చేసాడట. వెంటనే ఆమె ఆ దుండగుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అంతేకాదు ఎంతో ధైర్యంగా అతడి కారును వెంబడించి నిందితున్ని పోలీసులకు అప్పగించింది. . ఇటువంటి నీచులకు కఠిన శిక్ష విధించాలి అంటూ కోరింది.... ఇటువంటి వారికి సమాజంలో తిరిగే హక్కు లేదంటూ వ్యాఖ్యానించింది.
మహిళా ఎంపీ ఫిర్యాదుమేరకు పోలీసులు క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మిమి చక్రవర్తి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ‘నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే మొదట లైట్ తీసుకున్నా. కానీ ఇటువంటి వారిని అలాగే వదిలేస్తే ... అతన్ని నమ్మి ఆ టాక్సీలో ప్రయాణించే మహిళలకు కూడా రక్షణ ఉండకపోగా ప్రమాదం ఉందని భావించి పోలీసులకు కంప్లైంట్ చేశాను. సాటి మహిళగా అందరి క్షేమం కోరే.. అతడి కారును వెంబడించి మరీ పట్టుకుని పోలీసులకు అప్పగించాను’ అంటూ తెలియజేశారు. ఈమె ధైర్యం చూసి.... ప్రతి మహిళ ఇలా ధైర్యం గా ఉంటూ... మనకెందుకులే అనుకోకుండా అన్యాయాన్ని ఎదిరించాలంటూ.... కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి