కరోనా మహమ్మారిని ఈ ప్రపంచం నుండి తరిమికొట్టే వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వేల కోట్ల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారత దేశ ప్రజలకు ఎంతో సంతోషకరమైన శుభవార్త ను అందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ... ఇది నిజమే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ.... ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదంటూ.... తీపి కబురు చెప్పారు. ఈ గురువారం కరోనా వ్యాక్సిన్ ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన త్వరలోనే వ్యాక్సిన్ రాబోతుంది అని పేర్కొన్నారు. ఈ వార్త విన్న దేశ ప్రజలు వ్యాక్సిన్ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని అనుకున్న సమయానికి అందుబాటులోకి రావాలని దేవుని ప్రార్థిస్తున్నారు.

రాజ్య సభకు హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్.. వ్యాక్సిన్ గురించి ఇలా వ్యాఖ్యానించారు.... వ్యాక్సిన్ తయారు చేయడం అంటే మాయాజాలం కాదు భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలనుకుంటే కొంచెం సమయం సరిపోతుంది. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు కట్టడి చేయాలంటే మాస్కులు తప్పనిసరి... ఇవే కీలక పాత్ర పోషిస్తాయి... ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను 10 కోట్ల డోసులు వరకు కొనుగోలు చేసేందుకు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.. మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ భాగస్వామి అస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తున్న భారత సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు క్లినికల్ ట్రయల్స్ మళ్లీ పున ప్రారంభించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించింది. దీంతో వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలు కానున్నాయి.    
                         
ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం.. 33 సంస్థలు కరోనావైరస్‌ వ్యాక్సిన్ లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా. వాటిలో తొమ్మిది సంస్థల క్లినికల్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా, క్యాసినో-బీజింగ్ ఇన్‌స్టిట్యూట్, జెన్‌సెన్ ఫార్మా,సైనోవాక్, సైనోఫార్మ్-వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రాడక్ట్స్, మోడెర్నా, బయోనెట్-ఫైజర్ తదితర వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం 40 వేల మందిపై జరుగుతున్నాయి. మొదట్లో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సున్న వారికి ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయి... కాగా ఇప్పుడు 60 ఏళ్ల పైబడిన వారిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫలితాలు నవంబరు కంటే ముందే వస్తాయని డా. రెడ్డీస్ ల్యాబ్ వారు ప్రకటించారు. ఈ ఏడాది చివరినాటికి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ఈ లోగా అనుమతులు, పరీక్షలు మొత్తం పూర్తవుతాయని సంస్థ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: