మామూలు గా చిన్న దేశం పెద్ద దేశం అనే తేడా లేకుండా తమ సరిహద్దుల విషయం లో ఎంతో కఠిన నిబంధనలతో ఉంటాయి దేశాలు. కొన్ని కొన్ని పెద్ద దేశాలు చిన్న దేశాల విషయం లో ఎంతో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చైనా చుట్టు పక్కల ఉన్న హాంకాంగ్.. లాంటి దేశాల పై ఆధిపత్యం చెలాయించేందు కు ఎలా అయితే వ్యవహరిస్తుం దో  అగ్రరాజ్యమైన అమెరికా కూడా కొన్ని చిన్న దేశాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణి  వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడు చిన్న దేశాల సరిహద్దుల వద్ద కవ్వింపుల కి  దిగుతూ ఉంటుంది.



 కానీ చిన్న దేశాలే  కదా అని చులకనగా చూసి సరిహద్దుల్లో  కవ్వింపులకు  దిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఇప్పటికే కొన్ని చిన్న దేశాలు నిరూపించాయి. ప్రస్తుతం అమెరికా విషయంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. చిన్న దేశమే కదా అనే అగ్రరాజ్యమైన అమెరికా తక్కువ అంచనా వేసుకుంది. కానీ  అగ్రరాజ్య విమానాన్ని కూల్చి వేసింది అతి చిన్న దేశం. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అమెరికా కు సంబంధించిన యుద్ధవిమానం వెనిజులా సరిహద్దుల్లో కి వెళ్ళింది.




 అయితే మొదట సదరు అమెరికా యుద్ధ విమానానికి  హెచ్చరికలు జారీ చేసిన వెనిజులా.. అయినప్పటికీ నిర్లక్ష్యంగా తమ దేశ గగనతలం లోకి  అమెరికా యుద్ధ  విమానం రావడంతో.. వెనుకా ముందూ చూడకుండా ఆ యుద్ధ విమానాన్ని  కూల్చేసింది. దీంతో అమెరికా కు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. అయితే ఇలా చిన్న దేశం అని చులకనగా చూస్తే పెద్ద రాజ్యాలకు సైతం షాక్ తప్పదు అని విశ్లేషకులు అంటున్నారు. అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియనుంది  అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: