ఇటీవలే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరిట సైబర్ నేరగాళ్లు కొంతమంది ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా ను సృష్టించారు. ఇక తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అని కొంత ఆర్థిక సహాయం సర్దుబాటు చేయాలి అంటూ స్నేహితులకు బంధువులకు ఆ ఖాతా నుంచి మెసేజ్ పంపారు. మళ్లీ రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అంటూ నమ్మబలికారు. ఇక అనుమానం వచ్చిన కొంతమంది అధికారులు ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమే తన అధికారిక ఖాతాలో తాను ఎవరినీ డబ్బులు అడగలేదని... తాను డబ్బులు అడిగాను అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ ఆమె తెలిపారు. ఇక ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నకిలీ ఖాతా ను తొలగించడం గమనార్హం, ఇక దీంతో వెంటనే అప్రమత్తమైన స్వాతి లక్రా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుతం నిందితులని పట్టుకునే పనిలో పడ్డారు సైబర్ పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి