ప్రస్తుతం తెలంగాణ లోని దుబ్బాక నియోజకవర్గం లో ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మరోసారి రాజుకున్న విషయం తెలిసిందే. నియోజకవర్గ స్థానంలో గెలుపుని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఎంతో వ్యూహాత్మకంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.  ముఖ్యంగా ప్రతిపక్ష బిజెపి అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచార పర్వం కొనసాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవలే అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు అనివార్యంగా మారిపోయిన విషయం తెలిసిందే.



 దీంతో ప్రస్తుతం దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి టిఆర్ఎస్ పార్టీలు  తీవ్ర కసరత్తులు  చేస్తున్నాయి. దుబ్బాక నియోజక వర్గంలో విజయం తమదేనని టిఆర్ఎస్ ధీమాతో ఉంటే..   ఈసారి ఎలాగైనా విజయం సాధించి తీరుతామని బిజెపి పార్టీ చెబుతుంది . దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నిక కోసం అభ్యర్థుల బెడద కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. అందరూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ చివరికి ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. దీంతో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది.



 ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఆకస్మికంగా మృతి చెందితే  దివంగత ఎమ్మెల్యే కుటుంబంపై  ఆ నియోజకవర్గ ప్రజలందరిలో ఎంతో సానుభూతి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రజల మనసుల్లో  ఉన్న సానుభూతుతో  ఎంతోమంది వారి వారసులు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. దుబ్బాకలో మాత్రం పూర్తిగా సీన్  రివర్స్ గా మారిపోయింది. ఇటీవలే అనారోగ్యం బారిన పడి మరణించిన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి... మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఇద్దరు కుమారులు కూడా వారి వారసత్వాన్ని అందుకోలేక పోయారు. అందుకే టిఆర్ఎస్ ఇప్పుడు వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు అని తెలంగాణ రాజకీయాల్లో  చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: