కొన్ని కొన్ని సంఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఒక్క విద్యార్థి చదువు కోవడానికి ఏకంగా రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం... లేదా ఒక విద్యార్థి కోసం ఎంతో ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం చూస్తూనే ఉంటా. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ విద్యార్థి కోసం కాదులేండి. కానీ  ఏకంగా ఒక వ్యక్తి కోసం విమానమే నడిచింది. ఒకే వ్యక్తితో విమానం ప్రయాణించింది. ఈ ఆసక్తికరమైన సంఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది. కరోనా వైరస్ సమయంలో ప్రవాసీలను  తరలించేందుకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ విమానం  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.



 అయితే బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విమానంలో వాస్తవంగా అయితే 30 మంది ప్రయాణించాల్సి ఉంటుంది. అధికారులు ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో న్యాయపరమైన సమస్యలు రావడంతో ఈ విమానంలో ప్రయాణించాల్సి ఉన్నా 29 మంది ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఆ 29 మంది బ్రిటన్ వదిలి వెళ్లకుండా ఉండేందుకు వారి తరపు న్యాయవాదులు చేసిన  ప్రయత్నాలు ఫలించాయి. దీంతో వారు బ్రిటన్ వదిలి వెళ్లకుండా కోర్టు ఆదేశాలు జారీ చేశారు.. అయితే ఇలా విమానం బయలుదేరే చివరి నిమిషం ముందు కోర్టుకు అపిల్ చేసుకోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఒక్క ప్రయాణికుడు తోనే విమానం  బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ కు బయలుదేరింది.




 ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిపోయింది. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడి  కోసం ప్రభుత్వం లేకుండా లక్ష పౌండ్లు ఖర్చు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఒక్క ప్రయాణికుడు ఉన్నప్పటికీ వెనకడుగు వేయని బ్రిటన్ ప్రభుత్వం 29 మంది ప్రయాణికులు లేకున్నప్పటికీ ఒక ప్రయాణికుడి  తోనే విమానం నడిపించింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే న్యాయవాదులు చేశారు అంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం బయలుదేరే చివరి నిమిషంలో బ్రిటన్  దాటివెళ్లకుండా పిటిషన్లు దాఖలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: