ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు..మన అనుకున్న వారే వెన్నుపోటు పొడుస్తున్నారు..అందుకే అంటారు మన నీడను కూడా మనం నమ్మడానికి వీలు లేదని.అది నిజమని అనిపిస్తుంది. ఫ్రెండ్ అనుకోని ఇంట్లోకి రాణిస్తే తీరా ఇంటికే నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలిసి తిరిగాము కలిసి బ్రతకాలి అంటూ ఓ ఉన్మాది కర్కశంగా ప్రవర్తించారు. కూతురును నాకు ఇచ్చి పెళ్లి చేయకుంటే చంపేస్తాను అంటూ బెదిరింపులకు దిగడమే కాదు.. అనుకున్న పని చేశాడు. 



వివరాల్లోకి వెళితే..ఈ ఘటన చెన్నైలో జరిగింది. వలసవారక్కం ఏరియా అన్బునగర్‌కి చెందిన యువతి, అరియాలూరుకి చెందిన జీవానందం ఇద్దరూ కలిసి చదువుకున్నారు. గత నెల 29న చెన్నై వచ్చిన జీవానందం నేరుగా యువతి ఇంటికెళ్లాడు..సరేలే అని ఆశ్రయం ఇచ్చింది. నాలుగు రోజులు దాటినా అతడు ఏం మాట్లాడలేదు.. అలాగని బయటకు వెళ్ళలేదు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తల్లి దండ్రులు అమ్మాయిని పిలిచి మండిపడ్డారు.ఇలాంటి వాడితో నీకు స్నేహం ఎంటి అంటూ చివాట్లు పెట్టారు.ఇరుగుపొరుగుకు తెలిస్తే గౌరవంగా ఉండదని చెబుతుండగా చాటుగా విన్న యువకుడు ఊహించని షాకిచ్చాడు.



అయితే ఓ రోజు రాత్రి నిద్రపోతున్న అమ్మాయి తల్లి దండ్రులను నిద్ర లేపి మీ కూతురిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటాననడంతో నిర్ఘాంతపోయారు. ఆ అరుపులు విని అక్కడకు వచ్చిన యువతి ఫ్రెండ్ ప్రవర్తనను చూసి కంగుతిన్నది.యువతితో తనను ప్రేమించాల్సిందేనంటూ ఒత్తిడి చేశాడు. ఫ్రెండ్ కదా అని ఇంట్లోకి రానిస్తే పేరెంట్స్ ముందు పరువు తీశావంటూ యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని, ఆమె పేరెంట్స్ ను ఒక గదిలో బంధించి గ్యాస్ లీక్ చేశాడు. గ్యాస్ వాసన వస్తుండటంతో పక్కింటి వాళ్ళు పరుగున అక్కడకు వచ్చారు. వారికి చిక్కితే కొడతారని భయపడిన వ్యక్తి కిటికీ అద్దంతో గొంతుకోసుకోని చనిపోయాడు.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..



మరింత సమాచారం తెలుసుకోండి: