ఏటీఎం సెంటర్ కు వెళ్లి ఏ చిన్న పొరపాటు చేసినా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి. అయితే ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్క వినియోగదారుడు ఒక విషయం తప్పక గుర్తు పెట్టుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు. ఏటీఎం లో డెబిట్ కార్డు పెట్టే స్లాట్ దగ్గర గ్రీన్ లైట్ ఒకటి ఉంటుందని... అది గమనించాలి అని సూచిస్తున్నారు. ఏటీఎం కార్డ్ స్లాట్ లూస్ గా ఉండటం... లేదా ఏదైనా అంటించినట్లున్న ఉన్నా వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని సూచిస్తున్నారు. గ్రీన్ లైట్ కనిపించకపోయినా లేదా ఏటీఎం కార్డ్ స్లాట్ లూస్ గా ఉండడం లేదా అంటించినట్లుగా ఉండటం కనిపించిన అక్కడ ఏటీఎం మోసం జరుగుతుందని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే ఆ ఏటిఎం సేఫ్ అని భావించాలి అని చెబుతున్నారు. ఒకవేళ అక్కడ గ్రీన్ లైట్ కు బదులుగా వేరే లైట్ ఉంది అంటే... ఏటీఎం మిషన్ లో డబ్బులు విత్ డ్రా చేసుకోకపోవడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు. ఏటీఎం సెంటర్ లో ఏటీఎం పెట్టే స్లాట్ వద్ద గ్రీన్ లైట్ వచ్చింది అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పని చేస్తోంది అని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి లైట్ లేదు అంటే ఆ ఎటిఎం స్లాట్ లో మోసగాళ్ళు ఏదైనా పరికరాన్ని అమర్చి ఖాతాకు సంబంధించిన ఏటీఎం పిన్ కూడా తెలుసుకుని ఆ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడి ఖాతాను ఖాళీ చేస్తారు అంటూ చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి