అగ్రరాజ్యం అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రాముఖ్యతని కలిగివున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో దిగనున్న ట్రంప్ మరియు జో బైడెన్ వారి ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీ గా ఉన్నారు. అయితే రెండు రోజులక్రితం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇందుకు భయపడాల్సిన అవసరం ఏమీలేదని వైద్య బృందం తెలిపింది.  దీనితో అత్యంత ప్రభావంతమైన రష్యా మరియు చైనా దేశాలు వారి మద్దతును ఎవరికి తెలుపుతాయి? అలాగే ఎవరు గెలవాలని వారు అనుకుంటున్నారో తెలుసుకోవాలనుందా అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము.

అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చైనా మరియు రష్యా దేశాలను ఉద్దేశించి హెచ్చరించారు.  అయితే అమెరికా ఎన్నికలను మరియు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వారికి వ్యక్తిగత లక్ష్యాలు మరియు సొంత సామర్ధ్యాలు ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీనితో నవంబరు 3న జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు చాలా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా నిఘా ఉద్యోగి ఒక్కరు మాట్లాడుతూ రష్యా ముప్పు తీవ్రతను తగ్గించి అమెరికాకు తెలిచేయాలంటూ తనపై ఒత్తిడిని తీసుకువచ్చారని చెప్పారు. ఒకవేళ నేను రష్యా ప్రభావాన్ని తక్కువ చేసి చెప్పకపోతే అది అధ్యక్షుడు ట్రంప్‌ సామర్థ్యాలను తక్కువ చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో తనపై ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. అందుకు నేను ఏమాత్రంఒప్పుకోలేదని  మరియు నా దేశానికి బాధ్యతగా కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియచేసారు.

గతవారంలో రష్యా నిర్వహించిన రిపబ్లికన్ల సెనెట్ ప్యానల్ సమావేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మళ్ళీ ట్రంప్ గెలవాలని పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. దీనితో రష్యా ట్రంప్ గెలవాలని అనుకుంటున్నట్లు తేటతెల్లమైంది. అయితే డ్రాగన్ దేశమైన చైనా మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవకుండా అన్ని ప్రయత్నాలను చేస్తోంది. అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేఖంగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ చైనా సపోర్ట్ తెలియచేసే ఆలోచనలో ఉంది. మరి ఇందులో రష్యా కోరుకునే విధంగా మళ్ళీ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటాడా....లేదా డ్రాగన్ కోరిక మేరకు రిపబ్లికన్ జో బైడెన్ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు కానున్నారా అనేది తెలియాలంటే ఇంకా నెలరోజులు వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: