ఐపీఎల్ ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా బౌలర్లకు ముప్పు మరీ ఎక్కువైపోతోంది. లీగ్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ప్రధాన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కూడా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. చెన్నైతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా భువనేశ్వర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. ముంబైతో తర్వాతి మ్యాచ్‌లో భువీ ఆడలేదు.
గాయపడ్డ భువనేశ్వర్‌కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు భువనేశ్వర్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భువీ స్ట్రైక్ బౌలర్. ఇలాంటి బౌలర్ దూరమవ్వడం సన్‌రైజర్స్‌కు పెద్ద లోటే అని చెప్పవచ్చు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కూడా గాయాల సమస్య వేధిస్తోంది. నిలకడగా రాణిస్తున్న అమిత్ మిశ్రా కుడి చేతి వేలు విరగడంతో టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. అమిత్ మిశ్రా ఢిల్లీకి కీ బౌలర్. ఇప్పటికే ఢిల్లీ టీమ్‌కు గాయంతో ఇషాంత్ దూరమయ్యాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.
32 ఏళ్ల ఇషాంత్ ఇటీవల తరచుగా గాయాల పాలవుతున్నాడు. గత జనవరిలో చీలమండ గాయంతో నెల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను.. తిరిగి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు ఆడలేకపోయాడు. ఈ సీజన్ స్టార్టింగ్‌లో అశ్విన్ కూడా గాయంతో మూడు మ్యాచ్‌లు ఢిల్లీకి ఆడలేదు. ఇప్పుడు గాయం నుంచి కోలుకున్నా అశ్విన్ ఢిల్లీ కీలక బౌలర్‌గా మారాడు.
టోర్నీ మధ్యలో ఎవరికైనా గాయమైతే అప్పటికప్పుడు మరో ప్లేయర్‌ను గత సీజన్లలో తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరినైనా తీసుకోవాలంటే మళ్లీ ఆ ప్లేయర్‌కి కొవిడ్ పరీక్షలు, క్వారంటైన్ లాంటి సమస్యలు ఉన్నాయ్. ఇలా ప్రాంచైజీలకు ఆటగాళ్ల గాయాలు పెద్ద సవాల్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి