అంతే కాకుండా ఉత్తర కొరియా రక్షణ రంగ వ్యవస్థ మరింత పటిష్టవంతం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, పరిపాలన విషయంలో తనపై నెలకొన్న ఒత్తిడి కారణంగానే ఆయన కంటతడి పెట్టుకుని వుంటారని మరి కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఉత్తర కొరియా 75 వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త వాదనను తెరమీదకు వచ్చింది. ఏకంగా ఉత్తర కొరియా నుంచి అమెరికా టార్గెట్ చేసే విధంగా ఒక అద్భుతమైన క్షిపణి తయారు చేశారు అన్న వాదన వినిపిస్తోంది.
ఇకపై ఆయుధానికి వెనకాల ఉన్నటువంటి మర్మం గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే కేవలం క్షిపణి గురించి మాత్రమే కాదు ఉత్తరకొరియాలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల గురించి పెద్ద ఎత్తున పరిశోధన జరగగా ఎన్నో విషయాలు బయట పడ్డాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలు అన్నింటినీ పక్కనపెట్టి వ్యూహాత్మకంగా.. కొంతమంది బ్రాడ్ కాస్టర్లు ఔత్సాహిక పరిశోధకులు కలిపి రహస్య ఆపరేషన్స్ చేస్తున్నారని ఎన్నో ఆయుధాలను తయారు చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఉత్తర కొరియాకు కావలసినటువంటి పరికరాలను అన్నింటిని ఎంతో రహస్యంగా వివిధ రూపాలలో రప్పించి ఎన్నో ఆయుధాలను తయారు చేస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి