ఏకంగా కార్లు పెద్ద పెద్ద వాహనాలు సైతం రోడ్లపై నదిలాగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోవడం లాంటివి కూడా జరిగింది. మనుషుల పరిస్థితులు మరింత ఆగమ్యగోచరంగా మారిపోయింది. పూర్తిగా నీటితో నిండిపోయిన ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న కురిసిన వర్షాలకు రహదారులు అన్ని పూర్తిగా ధ్వంసం అయిపోయిన విషయం తెలిసిందే. కనీసం అక్కడ రహదారి ఉండేదా అన్న దాఖలాలు లేకుండా ధ్వంసం అయిపోయాయి రహదారులు. చిన్న చిన్న రహదారిలే కాదు జాతీయ రహదారులకు కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడింది.
అయితే గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పడిన భారీ వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి... దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై చాలా రోడ్లను రాకపోకలు నిషేధించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు భూపాలపల్లి విజయవాడ వెళ్లే రహదారి అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయితే రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు ధ్వంసం కారణంగా ఏకంగా 1200 కోట్ల నష్టం వాటిల్లితే... కేవలం ఒక మంగళవారం కురిసిన వర్షానికి ఏకంగా రహదారులు ధ్వంసంతో 500 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి