తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్ల పై నీళ్లు తప్ప జనాలు కనిపించలేదు.. గత  నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ నీటిమయం అయ్యింది. తెలంగాణలోని పలు జిల్లాలోని పంట నీట మునిగిపోయింది. ప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం తప్ప ప్రజలు వేరేది ఆలోచించలేదు.. అలాంటి పరిస్థతుల్లో ప్రజలు ఉన్నారు. ఎక్కడ చూసినా నీరు.. సంద్రం లాగా మారింది.. ఏ చోట నుంచి వరద వస్తుందో ,కొట్టుకు పోతమో అని ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఇంకా వదలడం లేదు..

హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. హైటెక్ రేంజులో ఉన్న సిటీ అధ్వానంగా తయారైంది. ఎప్పుడు ఎండలతో మండిపోయే సిటీ ఇప్పుడు స్విమ్మింగ్ ఫూల్ మాదిరి మారింది. ప్రముఖ నగరాలన్నీ కూడా జల దిగ్బంధం లో ఉండగా, కొన్ని నగరాల్లో నీరు లేకపోయినా మూడు రోజులు గా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు అన్నీ గంటలుగా మారాయి. దాదాపు 1700 కాలనీలు జల దిగ్బంధం లో ఉండి పోయాయి.

వరద నీరు పోటెత్తడంతో అధికారులు కూడా సహాయ చర్యలు చేపట్టాలనే పరిస్థితి.. నగరంలో రోడ్లు నీటితో కప్పేశాయి.ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. రోజువారీ కూలీలు పరిస్థితి మళ్లీ మొదట వచ్చింది.కురుస్తున్న వర్షాలకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కేసీఆర్ సార్ మా గోడును పట్టించుకోండి అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాణాలను కోల్పోతున్నారు. మరీ ఈ వర్షాలను ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ వర్షాల పై కామెడీ మీమ్స్ ను చేస్తున్నారు. వర్షాలకు సతమతమవుతున్న వాళ్లకు ఈ ఫన్నీ మీమ్స్ కాస్త ఊరటనిస్తున్నాయి. సోషల్ మీడియా లో కొన్ని ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.. మీరు అవేంటో చేసేయండి..




మరింత సమాచారం తెలుసుకోండి: