ముంబాయ్ లో మాత్రమే కాకుండా పూర్తిగా మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లిపోయాయి . ఎక్కడ చూసినా పూర్తిగా వరద నీటితో నిండిపోవడం తో పెద్ద పెద్ద చెరువులను తలపిస్తు... అక్కడ భవన సముదాయం కాదు పెద్ద పెద్ద చెరువులు ఉండేవి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గినప్పటికీ ఆ వరద ప్రభావం మాత్రం ఇప్పటికీ కూడా తగ్గడం లేదు. దీంతో ఎంతో మంది ప్రజలు ఇప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్న జనాలు ప్రస్తుతం వరదలతో కూడా మరింత భయాందోళనకు గురవుతున్నారు.
అది మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏకంగా మూడు రోజుల వ్యవధిలో 48 మంది వరకు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూణే డివిజన్లో 29 మంది ఔరంగాబాద్ డివిజన్లో 19 మంది.. కొంకణ్ డివిజన్ లో ముగ్గురు వరదల కారణంగా చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇక వరదల్లో చిక్కుకుపోయిన 40 వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని భారీ నష్టం వాటిల్లినట్లు చెప్పుకొచ్చారు అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి