ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ వైరస్ వలన ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి మరియు అనేకమంది కనీసం వారి కుటుంబ సభ్యుల చివరిచూపుకు కూడా నోచుకోకుండా దిక్కులేని చావు చచ్చారు. మరి ఇలాంటి కరోనా వైరస్ అంటే  ఎవరికి భయం ఉండదు చెప్పండి. కరోనా వైరస్ ను నిలువరించడానికి ఆయా దేశాలలో రకరకాలుగా నియమ నిబంధనలను అనుసరిస్తున్నారు. ఒక దేశంలో అయితే కనీసం కుటుంబ సభ్యులు కూడా శృంగార పరంగా కలవకూడదని ఆంక్షలు పెడుతున్నాయి. మరి ఈవింత ఏ దేశంలో జరిగిందో తెలుసుకుందాము.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో బ్రిటన్ దేశం వారి ప్రజలను కరోనా నుండి కట్టడి చేసేందుకు కొన్ని కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ ఉద్రిక్త సమయంలో శృంగారం  వద్దని.. బ్యాచిలర్ లైఫ్ గా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దంపతులు కుటుంబ సభ్యులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని.. లండన్ టూటైర్ త్రీటైర్ నగరాల్లో ఈ మేరకు శనివారం బ్రిటీష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా ఉంటున్న భార్యభర్తలు సుధీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో లేదా బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకుల్లో పేర్కొంది.

 బ్రిటీష్ ప్రజలు ఎలాంటి లైంగిక సంబంధాలకు మొగ్గు చూపవద్దని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జంటలు సహజీవనం చేస్తున్నా.. కలుస్తున్నా భౌతికదూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బ్రిటన్ దేశంలోని ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. కుటుంబాల మధ్యన ఉండే  లైంగిక సంబంధాలపై ఆంక్షలు విధించే హక్కు ప్రభుత్వానికి లేదని.. ఈ విధమైన ప్రకటన చేయడం...మా హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని ఆ దేశ ప్రజలంతా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.  మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: