ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం అనేది ఒకరి  సమస్య కాదు అందరి సమస్యగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో పౌష్టిక ఆహారాన్ని తీసుకోకపోవడం ఎక్కువగా ఒత్తిడికి లోనవడం లాంటివి  జరుగుతున్న నేపథ్యంలో... చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక జుట్టు సంరక్షణకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మాత్రమే కాస్తోకూస్తో ప్రయోజనాలు చేకూరుస్తూ ఉంటాయి. అయితే  కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అప్పుడప్పుడు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఓ చిన్న చిట్కాతో మీ జుట్టు రాలకుండా సంరక్షించుకోవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు. అరకప్పు ఆర్గానిక్ బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ తీసుకుని బాగా కడిగిన తర్వాత శుభ్రపరిచిన బియ్యాన్ని వేరే గిన్నెలో తీసుకుని రెండు కప్పుల నీటిలో సుమారు రెండు గంటల పాటు నానపెట్టాలి . ఇక ఆ తర్వాత బియ్యం నానబెట్టిన నీటిని గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయాలి. వీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. ఇక ఆ తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి దానిలో ఒక టీ స్పూన్ ఆముదం కలిపి... స్ప్రే  చేసుకుంటే జుట్టు పెరుగుదలను ఇది ఎంతగానో వేగవంతం చేస్తుందట.



 జుట్టుపై స్ప్రే చేసి మసాజ్ చేసి తర్వాత రాత్రంతా అలాగే వదిలేసి ఉంచాలట.  ఇలా రెగ్యులర్ గా చేయడం ద్వారా ఎంతో మంచి ఫలితం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యం నీటి వల్ల తల లోతుగా శుభ్రం అవుతుందట... పొడి జుట్టు ఉన్న వారికి ఇది కండీషనర్గా కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు  ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఉంచడంతో పాటు సిల్కీగా కూడా చేస్తుందట ఈ  చిట్కా. ఇలా ఒక రోజు రెండు రోజులు చేసి వదిలేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదని రెగ్యులర్గా ఇదే పద్దతిని పాటిస్తూ వస్తే కొన్ని రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. ఈ చిట్కా ద్వారా తలపై ఉన్న చుండ్రు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: