ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఎప్పుడు ప్రపంచ దేశాలలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసింది. ముఖ్యంగా చైనా కు బానిస దేశం గా మారిపోయిన పాకిస్తాన్ మన దేశ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి పాకిస్తాన్ దేశ సార్వభౌమాధికారాన్ని చైనా దగ్గర తాకట్టు పెట్టి ప్రస్తుతం చైనా చెప్పినట్లుగా ఆడే బానిస దేశం గా మారిపోయింది. ఈ క్రమంలోనే రోజు రోజుకు పాకిస్తాన్లో చైనా సైనికులు చేస్తున్న అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు పాకిస్తాన్ ప్రజల్లో ఆర్మీలో కూడా తిరుగుబాటు వస్తున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఆర్మీ లోని ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తూ ఇప్పటికైనా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ దేశ ప్రజల ప్రయోజనాల కోసం కృషిచేస్తూ చైనా కు బానిస దేశం గా ఉండకుండా తీరు మార్చుకోవాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ కి సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాము  చైనాకు బానిసలం కాదని.. కేవలం మిత్ర దేశంగా మాత్రమే చైనాతో కొనసాగుతున్నాము  అని ప్రపంచ దేశాలకు నిరూపించుకోవడానికి ఇటీవలే పాకిస్తాన్ ఏకంగా చైనా కు సంబంధించిన టిక్ టాక్ ను పాకిస్తాన్లో బ్యాన్  చేసిన విషయం తెలిసిందే.



 అసభ్యకర సమాచారం ఉంది అంటూ ఆరోపణలు చేసి టిక్ టాక్ ను  బ్యాన్ చేసింది. బ్యాన్  చేసి రోజులు కూడా గడవనే  లేదు అప్పుడే టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టిక్ టాక్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందామని టిక్ టాక్ లో మరిన్ని మార్పులు చేయాలి అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం సూచిస్తూ టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ  నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇలా తాము చైనాకు బానిస దేశం కాదు అని నిరూపించుకోవాలని ప్రయత్నించినప్పటికీ అందులోనూ పాకిస్తాన్ విఫలమైందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: