పెళ్లి చేసుకున్నప్పుడు భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అని పెద్దలు సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే కొంతమంది భార్యలు తమ భర్త తప్పు చేస్తున్నప్పటికీ అతని అడుగుజాడల్లోనే నడుస్తూ చేస్తున్న దారుణాలు రోజురోజుకు వెలుగులోకి వస్తు అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో భర్త దొంగతనాలు చేస్తూ ఉంటే దానికి భార్య కూడా సహకరించడం చర్చనీయాంశంగా మారగా.. ఇక ఇప్పుడు ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కువగా బెట్టింగ్ల హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలా బెట్టింగులు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపుతు ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు బెట్టింగ్ నిర్వహిస్తున్న వారివి అరెస్టు చేస్తూనే ఉన్నారు.. కానీ బెట్టింగ్ మాఫియా మాత్రం ఎక్కడా తీరు మార్చుకోకుండా పోలీసులకు తెలియకుండా ఎంతో రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్న  విషయం తెలిసిందే. అయితే ఇక్కడ గోవా నుంచి భర్త క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే హైదరాబాదులో భార్య వసూలు చేస్తూ ఉంటుంది. అన్యోన్య దంపతులను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటి వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్న కేసుల్లో  మగవారు మాత్రమే ఉండగా ఇక ఇప్పుడు మహిళ కూడా పోలీసులకు చిక్కడం తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.



 మంగళ్ హాట్  నివాసి ధరమ్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు అనే కీలక సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు అతనిపై నిఘా ఏర్పాటు చేశాడు. ఇక ఐపీఎల్ బెట్టింగ్ మాఫియా నడవడం మొదలుపెట్టాడు ధరమ్  సింగ్. తన అల్లుడికి ప్రతినెల 25 వేల రూపాయల జీతం ఇచ్చి... ఎంతో మంది నుంచి బెట్టింగ్ వివరాలు సేకరించి బెట్టింగ్ నిర్వహించేవాడు. అయితే గోవాలో ధరమ్ సింగ్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటే హైదరాబాదులో ఉన్న భార్య సుమలత డబ్బులు వసూలు చేస్తూ ఉండేది. ఏకంగా  వారి చిరునామాల తెలుసుకుని ద్విచక్రవాహనంపై ఇంటింటికి తిరుగుతూ బెట్టింగ్ డబ్బులు వసూలు చేస్తూ ఉండేది. ఇటీవలే టాస్క్ఫోర్స్ పోలీసులు ధరమ్ సింగ్  ఇంట్లో సోదాలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: