ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగించేందుకు వివిధ దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అన్ని దేశాల లో శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న  ఈ మహమ్మారి వైరస్.. వెలుగు లోకి వచ్చి దాదాపుగా ఏడు నెలలు గడిచి పోతున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ అందుబాటు లో లేకపోవడం తో... ప్రస్తుతం ప్రత్యామ్నాయ చికిత్స పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు వైద్యులు.



 ఇక ఈ ప్రత్యామ్నాయ చికిత్స కూడా సరైన ఫలితం ఇవ్వకపోవడం తో ప్రస్తుతం వ్యాక్సిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కి చెందిన ఆస్ట్రాజెనికా  అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న
 విషయం తెలిసిందే. వేల మంది వాలంటీర్ల పై ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ అనారోగ్యం బారిన పడడం తో ఇటీవలి కాలంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు  సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.



 ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో నే భద్రతా ప్రమాణాలు సమీక్షించి మళ్లీ ఈ వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు.  ఇక ఇప్పుడు మరో సారి కరోనా వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షల్లో విషాదం చోటుచేసుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రోజెనికా  అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా పీక వేసుకున్న వాలంటీర్ మృతి చెందినట్లు ఇటీవలే బ్రెజిల్ ప్రకటించింది. అయితే వాలింటర్ మృతి వివరాలను సమీక్షించామని  వ్యాక్సిన్ భద్రత పై ఎలాంటి సందేహం అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది ఆక్స్ఫర్డ్.

మరింత సమాచారం తెలుసుకోండి: