సాధారణంగా కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో జరిగే కొన్ని అవాంచిత చర్యలను బయటపెట్టడానికి సిబిఐ - సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగడం చూస్తూనే ఉంటాం..... కానీ విచారణ లోకి దిగే ముందు సి బి ఐ ప్రత్యేకంగా ఆ రాష్ట్రం యొక్క అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. లేదంటే ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఎప్పుడైనా ఎలాంటి విచారణ అయిన రాష్ట్రంలో జరిపేందుకు... జనరల్ పర్మిషన్ పొందాల్సి ఉంటుంది.... రాష్ట్రానికి ఏదైనా నష్టం వాటిల్లుతుంది అనుకున్న సందర్భంలో రాష్ట్ర అధికారి యొక్క జనరల్ పర్మిషన్ ను రద్దు చేసే వెసులుబాటు ఉంటుంది... వీటన్నింటికీ సంబంధించి తెలకపల్లి రవి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధానంగా మూడు సమస్యల గురించి మాట్లాడారు.

కేసు రాష్ట్రం నుండి సీబీఐకి బదిలీ చేసే తరహాలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రభుత్వం చేసినట్లుగా ...ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు చేసుకోవడానికి ఇచ్చిన సార్వత్రిక అనుమతి అయిన జనరల్ పర్మిషన్ ను ఉపసంహరించుకోవడం జరిగింది.... అయితే దీని వెనుక పలు భారీ కారణాలు వినిపించాయి. అందులో ముఖ్య కారణం మహారాష్ట్ర కి వ్యతిరేకంగా కేంద్రం సిబిఐని సంధించింది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇదేమీ మొదటిసారి కాదు ఇలా ఇప్పటికే మూడు సార్లు సిబిఐని ఇదే తరహాలో ప్రయోగించినట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎల్ గాడ్ పరిషత్ లో అనేక మందిపై రాజద్రోహం దేశద్రోహం అంటూ నేరాలు మోపి అరెస్టు చేశారు..... అంతేకాదు ఎంతోమంది కవులు రచయితలపై కూడా పలు నేరాలు మోప బడ్డాయని...తాజాగా జార్ఖండ్ నుండి గిరిజనుల కోసం అహర్నిశలు పనిచేసే శాన్ స్వామి అనే వృద్ధుడిని మావోయిస్టు సహకరిస్తున్నారంటూ అరెస్టు చేశారు అని పేర్కొన్నారు.

ఈ విధంగా దళితులు నిర్మించుకున్న ఎల్ గాడ్ పరిషత్తు మీద దాడి చేశారని తెలిపారు. అంతేకాదు అక్కడి ప్రజలలో కొందరు ప్రధాని నరేంద్ర మోడీపై హత్యకు సన్నాహాలు చేశాడంటూ నేను నిందించి అరెస్ట్ చేయడం జరిగింది...ఆ కేసులో వారికి కనీసం బెయిల్ కూడా రాలేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కేసు విచారణను మహారాష్ట్ర నుండి తప్పించి సిబిఐ చేతికి ఇచ్చారు ఇది మొదటి అడుగు అనుకుంటే.... ఆ తర్వాత బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును కూడా మహారాష్ట్ర పరిధి నుండి తప్పించి సి.బి.ఐ కు అప్పగించారు... ఇక్కడ అ ఇలా కేసు సీబీఐకి ఎందుకు బదిలీ అయింది అని పలువురు ప్రశ్నించగా... బీహార్ ప్రభుత్వం అడిగిందని తెలిపారు..... అయితే దీని వెనక అసలు రహస్యం ఏమిటంటే అప్పటికే బీహార్ ప్రజలు ఎన్నికల విషయంలో అసంతృప్తిగా ఉండగా... ఆ విషయాన్ని పక్కన పెడితే సుశాంత్ సింగ్ కేసును తమ రాష్ట్ర ఆత్మ గౌరవంగా హైలెట్ చేస్తూ ప్రయోజనం పొంద వచ్చని రాష్ట్రం ప్లాన్ చేసినట్లు దీనికి కేంద్రం కూడా సహకరిస్తూ క్షణాల మీద కేసును సిబిఐకి అప్పగించింది అని.... ఆ తర్వాత సుశాంత్ సింగ్ మహత్యం కేసు ఎంత ముందుకు పోయింది అన్నది  తర్వాత విషయం అని.... ఇది రెండో విషయం ఆయన అన్నారు. ఇక ఎప్పుడు మూడవది
టి ఆర్ పి స్కామ్.... ఈ విషయంలో ఏమైందంటే టి ఆర్ పి స్కామ్ ను పట్టుకుని రిపబ్లిక్ టీవీ వాళ్ళ మీద కేసు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: