వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర అధికార పార్టీ బిజెపి మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈమేరకు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది.దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశమంతా ఒకే ఓటర్ లిస్ట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంటే లోక్ సభ కు వాడిన ఓటింగ్ లిస్ట్ ను మళ్ళీ, అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల కు వాడే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



 కేంద్రం ఆలోచన ప్రకారం రాష్ట్రాల తో సంబంధం లేకుండా, స్థానిక సంస్థల ఎన్నికల కు సంబంధించి ఓటర్ల జాబితా సైతం ఎటువంటి సవరణలు లేకుండా ఒక్కటే ఉంటుంది. అయితే ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా అనేది సందేహంగా మారింది. దీనికి కారణం సంస్థల ఎన్నికలు అంటే పూర్తిగా గా రాష్ట్రాల పరిధిలోని అంశం. కానీ కేంద్రం తీసుకు రాబోయే ఈ విధానం ద్వారా ఆ అవకాశం పోతుంది. ఓటర్ లిస్టు లో మార్పుచేర్పులు చేసుకునేందుకు అవకాశం రాష్ట్రాలకు ఉండదు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ సైతం చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా జమిలి ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతోందనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. 



2022 లో సుమారు పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తరువాత 2023 లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసి 2022 లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కేంద్రం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న తరుణంలో, 2024 వరకు వేచి ఉంటే  ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆలోచనతో కేంద్రం ఈ విధానం వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు మొత్తం అంతర్గతంగా ఏం చేస్తున్నారు. జమిలి ఎన్నికలకు వెళితే కలిగే లాభనష్టాల పైన లెక్కలు వేసుకునే పనిలో కేంద్ర బీజేపీ పెద్దలు ఉన్నారట. ఏది ఏమైనా కేంద్రం తీసుకోబోతున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలో అలజడి రేపడం మాత్రం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: