ప్రస్తుతం దేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు అతి తక్కువ కేసులు  ఉన్న దేశంగా భారత్ ఆ తర్వాత క్రమక్రమంగా భారీగా  కేసులు  పెరిగిపోవడంతో ఎక్కువగా కేసులు  ఉన్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా నియంత్రణ మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రజలు కూడా పూర్తి అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి కరోనా వైరస్ మాత్రం ప్రజలపై పంజా విసురుతూనే ఉంది. ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేయడమే కాదు ఇంకా ఎంతో మందిని ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే.



 మహారాష్ట్రలో అయితే కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగి పోవడమే కాదు కరోనా వైరస్ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుండటం అందరిలో  ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో అయితే రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్నాయి. అయితే ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబై నగరంలో కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య పదివేలు దాటి పోయింది. 24 గంటల్లో ఒక్క ముంబై నగరంలోని ఏకంగా 1257 కరోనా కేసులు నమోదు కాగా 50 మంది మరణించారు.



 దీంతో ముంబై నగరంలో రోజు రోజుకు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు  ముంబైలో కరోనా మృతుల సంఖ్య 10.016కు పెరిగింది. ముంబై నగరంలోనే 2,50,061 మందికి కరోనా సోకగా, రోగుల రికవరీ శాతం 88 శాతంగా ఉంది. ప్రస్థుతం ముంబైలో 19,500 కరోనా క్రియాశీల కేసులున్నాయి.50 ఏళ్లు పైబడిన వారిలో 85 శాతం మరణాలు నమోదైనాయి. రోజురోజుకు ముంబై నగరంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం తో అందరూ ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: