ప్రభుత్వం ఎన్ని సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని హెచ్చరించినప్పటికీ వాహనదారులు మాత్రం తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం అనేది  వాహనదారులు రోజువారి పని గా పెట్టుకుంటారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన దాదాపుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటారూ.  భారీ జరిమానాలు ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా సీసీ కెమెరాలకు చిక్కకుండా ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు కనిపించకుండా షార్ట్ కట్ రూట్ లో వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అయి  పోతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 అతివేగం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల రూపంలో  ప్రాణాలు వదులుతున్నారు ఎంతోమంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు దక్కించుకోవాలని ఎన్నిసార్లు అధికారులు హెచ్చరించినప్పటికీ అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ దాదాపుగా వాహనదారుడు ఎవరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఎంతమంది వాహనదారులు పాటించడం లేదు అన్నది కొన్ని సర్వేలు వెల్లడిస్తున్న నిజాలు చూసి అందరూ అవాక్కవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు అని అర్థమవుతుంది ఏకంగా 40 శాతం మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ ఒక నివేదిక విడుదల చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు కారణంతో రోజుకు 9 మంది మృత్యువాత పడుతున్నారు అన్నది ఈ నివేదికలో వెల్లడయ్యింది. ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలు అవుతున్నారు అన్నది కూడా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: