దేశీయ దిగ్గజం ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం తమ కష్టమర్లందరికీ ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమ కస్టమర్లకు పలురకాల సర్వీసులను అందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకుపోతుంది. ఆకర్షణీయమైన అద్భుతమైన పాలసీలను అందుబాటులో తీసుకొస్తుంది. ఇక ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనుకునే  తల్లిదండ్రులు   అందరికీ అండగా నిలిచేందుకు చిన్న పిల్లల భవిష్యత్తు కోసం చిల్డ్రన్స్ ప్లాన్ అనే పాలసీ  అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. పాలసీ తీసుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు తక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయడం ద్వారా మెచ్యూరిటీ  సమయంలో భారీగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే  న్యూస్ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీలో  కేవలం 12 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల పేరు పైన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక లక్ష భీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి.



 ఈ పాలసీలో గరిష్ట మొత్తం ఎంత అనేదానిపై నుంచి ఎలాంటి పరిమితులు లేవు. పాలసీ తీసుకున్న వారు 18, 20,  22 ఏళ్ల వయసులో కూడా 20శాతం డబ్బులు పొందుతారు. మిగిలిన 40 శాతం మాత్రమే మెచ్యూరిటీ సమయంలో అందిస్తారు. బోనస్ కూడా కూడా ఉంటుంది. 25 ఏళ్ల వరకు ఈ పాలసీ కొనసాగుతుంది. ఏడాదిలో పాలసీ తీసుకుంటే ఈ పాలసీ గడువు 25 ఏళ్లు అవుతోంది. అయితే ఈ పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 20 ఏళ్ళు అవుతుంది. పాలసీదారుడు ఈ సమయంలో మరణిస్తే ఆ డబ్బులను నామినీకి చెల్లిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.


 ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  .  రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని భావించారు. ఇప్పుడు పాలసీదారుడికి 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు రూ.2 లక్షలు అందిస్తారు. అలాగే 20, 22 ఏళ్ల వయసులోనే రూ.2,00,000 చొప్పున ఇస్తారు. ఇక 25 ఏళ్ల వయసులో రూ.20,50,000 లభిస్తాయి. అంటే మొత్తంగా రూ.26,50,000 చేతికి వస్తాయి. ఈ మొత్తం పొందాలని భావిస్తే.. నెలకు రూ.3,600 ప్రీమియం కట్టాలి. అంటే రోజుకు రూ.120 ఆదా చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: