దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ కరోనా  వైరస్ కారణంగా భక్తులకు అలాంటి సదుపాయం దాదాపుగా దక్కలేదు అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది భక్తులకు. క్రమ క్రమంగా అన్ని సదుపాయాలను కల్పిస్తూ  టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కరోనా  వైరస్ తో మార్చి 20వ తేదీన మూతపడిన శ్రీవారి మెట్టు మార్గం నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.



 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గంలో అనుమతిస్తూ టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి ఇచ్చి శుభవార్త చెప్పిన టీటీడీ బోర్డు.. అదే సమయంలో భక్తులకు మరో బాడ్ న్యూస్ కూడా చెప్పింది. అలిపిరి నడక మార్గంలో భక్తులకు ఇప్పటివరకు అనుమతించిన సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు. ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.



 ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అలిపిరి నడక మార్గంలో అనుమతించ పోతున్నట్లు టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులందరూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను గమనించి తమకు సహకరించాలని అంటూ టిటిడి బోర్డు సభ్యులు కోరారు. ఇక టిటిడి నిర్ణయంతో శ్రీవారి భక్తుల అందరికీ ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. ఇక మరోవైపు 2021 సంవత్సరానికి గాను క్యాలెండర్లు డైరీలను కూడా టీటీడీ వెబ్సైట్లో ఉంచారు టిటిడి బోర్డు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: