ముంబై లోని రిపబ్లిక్ టీవీ అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి 2018 లో ఇంటీరియర్ డిజైనర్ ని మరియు ఆయన తల్లిని సూసైడ్ కి  ప్రేరేపించినట్లు వచ్చిన ఆరోపణపై ఆయన్ని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.... అయితే సీనియర్ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ అరెస్టు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టి ప్రశ్నించింది. అర్నాబ్ ను  ఎలా.. ఏ విధమైన నేరారోపణ పై అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. ప్రివిలేజ్ నోటీసులను అందుకున్న వ్యక్తిని అరెస్టు చేయడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యతిరేకించింది. ఈ విషయంపై పూర్తి వ్యతిరేక భావాన్ని చూపెట్టింది సుప్రీంకోర్టు. అర్నాబ్ గోస్వామి అరెస్టుకు సంబంధించి స్టే మంజూరు చేసింది సుప్రీం. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. అటు, ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులను పంపించింది. అన్ని విషయాలపై దృష్టి కేంద్రీకరించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు ధర్మాసనం ధ్రువీకరించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం అర్నాబ్ గోస్వామి అరెస్టు అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది మహా ధర్మాసనం.

 ఇక్కడ పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రశ్నించింది సుప్రీం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఆధ్వర్యంలో జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. అర్నాబ్ గోస్వామి తరఫున ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే నిలబడి ఆయన వైపు వాదనలను కోర్టుకు వినిపించారు. ఇక్కడ పలు కీలక అంశాలను  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు హరీష్. అసెంబ్లీ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీ ముందు మాత్రమే దాఖలు చేయాల్సిన లెటర్‌ను అసెంబ్లీ కార్యదర్శి బహిర్గతం చేయడాన్ని న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు కు విన్నవించారు. రహస్యంగా ఉండాల్సిన లెటర్‌ను బహిర్గతం చేశారని.... ఇది ఎలాంటి వ్యవహార శైలి క్రిందకు వస్తుందో ఆలోచించాలి అంటూ వాదించారు.

ఈ అంశంపై  చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే అసెంబ్లీ కార్యదర్శిపై మండిపడ్డారు. రహస్యంగా ఉంచాల్సిన లేఖను ఇలా బహిర్గతంగా అందరు ముందుకు తీసుకురావడం  సబబు కాదని...  ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేమని పేర్కొన్నారు. న్యాయ వ్యవహారాల్లోశాసనసభ జోక్యం చేసుకున్నట్టుగా కనిపిస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.... న్యాయవాది హరీష్ ఈ వాదనలకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఒక వ్యక్తిని సుప్రీంకోర్టును ఆశ్రయించేంతలా భయపెట్టారని, బాదించారని... ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలంటూ హరీష్ సాల్వే చేసిన విజ్ఙప్తి పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూల స్పందన ఇచ్చింది.మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులను జారీ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.  ఆర్నబ్ అరెస్టు ఈ విషయంపై మరిన్ని అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: