ట్రంప్, మెలానియా మధ్య ఇలాంటి కథనాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మెలానియా.. ఫస్ట్ లేడీగా ఉన్నప్పటికీ.. ట్రంప్‌తో అంటీముట్టనట్టు వ్యవహరించేవారు. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా.
సాధారణంగా విదేశీ పర్యటనల్లో అమెరికా అధ్యక్షులు, ఫస్ట్‌లేడీతో కలిసి పర్యటిస్తారు. కానీ ట్రంప్-మెలానియా ఎప్పుడూ సఖ్యతతో కనిపించలేదు. ట్రంప్‌ను మెలానియా దూరం పెడుతూ వచ్చారు. ఓ సందర్భంలో ట్రంప్ వేసిన జోక్.. మెలానియాకు ఆగ్రహం తెప్పించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ముందుగా వైట్‌హౌస్ వీడతారన్న ప్రశ్నకు..మెలానియా అయి ఉండొచ్చని ట్రంప్ అనడంపై.. మెలానియా తీవ్ర అసంతృప్తి చెందినట్లు కథనాలు వచ్చాయి. కుటుంబం విషయంలో ఇలాంటి జోక్స్ ఏంటని సీరియస్ అయినట్లు మెలానియా సన్నిహితులు తెలిపారు.
ట్రంప్ కుటుంబంలో విభేదాలు కొత్త విషయమేమి కాదు. ట్రంప్ అధ్యక్షుడిగా అయిన వెంటనే.. మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్‌హౌస్‌కొచ్చారు. ట్రంప్, మెలానియాల కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరిన తర్వాతే వైట్‌హౌస్‌కి వచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కూడా కూతురు ఇవాంకాకు ట్రంప్ ప్రాధాన్యం ఇవ్వడం.. మెలానియాకు నచ్చలేదు. అందుకే ట్రంప్‌తో ఆమె అంటీముట్టన్నట్లు ఉండేవారని ప్రచారం జరిగింది.
ట్రంప్‌తో మెలానియాది కాంటాక్ట్ మ్యారేజ్ అని సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి 2017లోనే మెలానియా.. ట్రంప్ నుంచి విడిపోవాలని భావించిందంటున్నారు. అమెరికా అధ్యక్షుడు కావడంతో.. వివాహ బందాన్ని కొనసాగించింది. రెండేళ్ల పాటు వైట్‌హౌజ్‌లో ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉన్నట్లు అమెరికన్ టాబ్లాయిడ్స్ కథనాలు ప్రచురించాయి. ట్రంప్ ఓడిపోతాడని ముందే ఊహించిందేమో, ఎన్నికల తర్వాత విడిపోతామని మెలానియా సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు..రెండో భార్య మార్లాతో కూడా ట్రంప్‌ది ఒప్పంద వివాహమేనని చెబుతున్నారు.
ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని డెయిలీ మెయిల్ కథనం వెల్లడించింది. మొత్తంమీద అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి.. ట్రంప్ జీవితాన్ని అన్ని విధాలుగా కోలుకోలేని దెబ్బతీస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి